Sun Mar 15 2026 14:04:32 GMT+0530 (India Standard Time)
కుమారస్వామి కొడుకు పెళ్లి కాదు గాని?
మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ వివాహం వివాదాస్పదమయింది. లాక్ డౌన్ సమయంలో, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ కుమారస్వామి తన కుమారుడి వివాహం [more]
మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ వివాహం వివాదాస్పదమయింది. లాక్ డౌన్ సమయంలో, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ కుమారస్వామి తన కుమారుడి వివాహం [more]

మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ వివాహం వివాదాస్పదమయింది. లాక్ డౌన్ సమయంలో, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ కుమారస్వామి తన కుమారుడి వివాహం ఈరోజు కేతగానహళ్లిలోని ఫాంహౌన్ లో జరిగింది. ఈ వివాహ వేడుకకు 200 మంది అతిధులు హాజరయ్యారు. దేవెగౌడ కుటుంబ సభ్యులతో పాటు, పెళ్లికూతురు తరుపున కొందరినే ఆహ్వానించినా 200 మంది వివాహానికి హాజరయ్యారు. వివాహ సమయంలో ఎవరూ సోషల్ డిస్టెన్స్ పాటించలేదని సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఘటన పై విచారణకు యడ్యూరప్ప సర్కార్ ఆదేశించింది. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే కుమారస్వామి కుటుంబం పై చర్యలు తప్పవని చెబుతున్నారు.
Next Story