Mon Feb 02 2026 18:48:59 GMT+0000 (Coordinated Universal Time)
కూకట్ పల్లిలో విషాదం

హైదరాబాద్ కూకట్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్ లో షెడ్డు కూలడంతో ఇద్దరు చిన్నారులు మరణించడంతో పాటు మరో నలుగురు చిన్నారులు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. పాఠశాల ప్రాంగణంలోని ఓ షెడ్డు కింద వీరు ఆడుకుంటున్న సమయంలో అది చిన్నారులపై కూలింది. ఘటన జరగగానే గాయపడ్డ చిన్నారులను స్థానిక అనుపమ ఆసుపత్రికి తరలించారు. మహికీర్తన, చందన అనే విద్యార్థినులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నిఖిత, నరేష్, సందీప్, దేవశ్రీ అనే విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యారు. స్కూల్ కి వెళ్లిన చిన్నారులు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
Next Story

