Thu Mar 19 2026 12:05:16 GMT+0530 (India Standard Time)
కూకట్ పల్లి టీడీపీ టిక్కెట్ నందమూరి కుటుంబానికే..!

తెలంగాణ ఎన్నికల బరిలోకి నందమూరి కుటుంబ సభ్యురాలు దిగబోతున్నారు. కూకట్ పల్లి స్థానం నుంచి నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని బరిలో ఉండటం ఖాయమైంది. ఆమె ఇవాళ విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. సెటిలర్ ఓట్లు, ముఖ్యంగా కమ్మ సామాజికవర్గ ఓటర్లు అధికంగా ఉండే కూకట్ పల్లి స్థానం నుంచి ఆమెను నిలబెట్టడం ద్వారా సులువుగా విజయం సాధించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. మరి, సోదరి తరపున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రచారం చేస్తారో లేదో చూడాలి.
Next Story

