Fri Mar 20 2026 05:11:35 GMT+0530 (India Standard Time)
పోరాట యోధుడి ఇంటికి అనుకోని అతిథి

తెలంగాణ సాయుధ పోరాటయోధుడి పుట్టినరోజుకు మంత్రి కేటీఆర్ అనుకోని అతిథిగా హాజరై ఆశ్చర్యపర్చారు. హైదరాబాద్ హబ్సిగూడలో నివాసముండే మిట్టా యాదవరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆదివారం ఆయన 88వ పుట్టిన రోజు. అయితే, యాదవరెడ్డి మనవరాలు నిధి రెడ్డి.. సాయుధ పోరాటంలో పాల్గొన్న తన తాత పుట్టినరోజు వేడుకలకు సమయం చూసుకుని రావాలని, ఆయన రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించాలని ట్విట్టర్ ద్వారా కోరారు. ఈ ట్విట్ కి స్పందించిన కేటీఆర్..ఆదివారం యాదవరెడ్డి ఇంటికి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరో మంత్రి జగదీశ్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి ఆయన యాదవరెడ్డితో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యాదవరెడ్డి పుస్తకం ‘నా జ్ఞాపకాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ ఫోటోలను కేటీఆర్ ట్విట్టర్ లో పంచుకున్నారు.
Next Story

