Wed Mar 18 2026 20:50:35 GMT+0530 (India Standard Time)
రాహుల్ గాంధీకి కేటీఆర్ ట్వీట్

ప్రజాసమస్యలను ట్విట్టర్ వేదికగా పరిష్కరించడంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముందుంటారు. అదేవిధంగా ట్విట్టర్ వేదికగానే ఆయన ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలను సైతం ఎక్కుపెడతారు. అయితే, ఇంతకాలం రాష్ట్ర నేతలపైనే ఆరోపణలు చేసే కేటీఆర్ ఈసారి ఏకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తరచూ ఒకేవిడతలో రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారని, అదే కర్ణాటకలో మీ సంకీర్ణ ప్రభుత్వం నాలుగు విడతల్లో రుణమాఫీ ఎందుకు చేస్తుందని, ఒకే విడతలో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
Next Story

