Mon Mar 16 2026 14:17:52 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : హరీష్ రావు ఇంటికి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ గా నియమితులైన కేటీఆర్... హరీశ్ రావు ఇంటికి వెళ్లారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై హరీశ్ రావుతో కేటీఆర్ చర్చిస్తున్నారు. అంతకుముందు హరీశ్ రావు... కేటీఆర్ కి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపగా... దానికి ‘థ్యాంక్స్ బావా’ అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు. పార్టీలో కీలక బాధ్యతలు తీసుకున్న కేటీఆర్... పార్టీ ముఖ్యులను కలుస్తున్నారు. ఆయన పార్టీ సెక్రెటరీ జనరల్ కేకేను కూడా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. హరీశ్ రావుతో భేటీ తర్వాత కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరగనున్న పార్టీ కార్యావర్గ సమావేశానికి హాజరుకానున్నారు.
Next Story

