Mon Mar 23 2026 23:12:06 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణలో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ఏపీలో తనకున్న అధికార యంత్రాంగాన్ని తెలంగాణలో రాజకీయపరమైన అవసరాలకు వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి తెరలేపుతున్నారని, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ తాత్కాలిక డీజీపీ కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని తెలంగాణలో కుట్రలకు తెరలేపుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మొదట సర్వేల పేరుతో ఏపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తాన్ని తెలంగాణలో మొహరించారని, ఇప్పుడు వారి ద్వారానే భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారన్నారు.
Next Story

