Wed Mar 18 2026 15:11:38 GMT+0530 (India Standard Time)
కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత నెలకొంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఆయన రోడ్ షో నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాధ్ కి, టీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు సతీష్ రెడ్డిని పక్కకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కలగజేసుకున్న మేయర్ బొంతు రామ్మోహన్ పోలీసులను ఆపి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన అలిగి రోడ్ షో నుంచి వెళ్లిపోయారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Next Story

