Mon Mar 23 2026 06:00:53 GMT+0530 (India Standard Time)
పవన్ కళ్యాణ్ కు కేటీఆర్ ఫోన్..?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ పై నిర్వహించిన జనసేన కవాతు విజయవంతం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ పవన్ కు ఫోన్ చేసి అభినందించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ - పవన్ మధ్య మాటల యుద్ధం నడిచినా ఇటీవల కొంత స్నేహం చిగురిస్తుంది. పవన్ కళ్యాన్ స్వయంగా కేసీఆర్ ను కలిసి ఆయన పాలనను మెచ్చుకున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ పెట్టాలనుకున్న ఫెడరల్ ఫ్రంట్ కు కూడా మద్దతు ఇస్తానని పవన్ గతంలో ప్రకటించారు. అయితే, తెలంగాణలో ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ కు కేటీఆర్ ఫోన్ చేశారనే వార్తలు మాత్రం ఆసక్తికరంగా మారాయి.
Next Story

