Tue Mar 17 2026 07:09:26 GMT+0530 (India Standard Time)
బావబామ్మర్దుల సెటైర్లివే...!!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక వ్యక్తులు హరీష్ రావు, కేటీఆర్ మధ్య ఆస్తికర సంభాషణ జరిగింది. శుక్రవారం సిరిసిల్లలో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు కేటీఆర్ బయలు దేరారు. అదే సమయంలో హరీష్ రావు సిద్ధిపేట సమీపంలోని గుర్రాల గొంది వద్ద కేటీఆర్ కు ఎదురుపడ్డారు. దీంతో ఇద్దరూ వాహనాలు దిగివచ్చిన ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భగా ‘కంగ్రాట్స్ బావా... నీకు లక్ష ఓట్ల మెజారిటీ గ్యారెంటీ... నీ మెజారిటీలో నేను సగమైనా తెచ్చుకుంటా’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తర్వాత కేటీఆర్ అక్కడి నుంచి సిరిసిల్ల బయలుదేరి వెళ్లారు.
Next Story

