Mon Mar 23 2026 00:31:31 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుపై కేటీఆర్ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై టీఆర్ఎస్ నేత కేటీఆర్ సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి, సీఎం రమేశ్ ఇంటిపై ఐటీ సోదాలు జరిగితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులు జరిగితే చంద్రబాబుకు ఏం సంబంధం అన్నారు. ఎక్కడ ఐటీ సోదాలు జరిగినా కేబినెట్ లో చర్చించి మరీ ఆవేదన తెలుపుతున్నారని ఎద్దవా చేశారు. ఐటీ దాడులు జరుగుతుంటే చంద్రబాబుకు ఏ మూలనో భయం ఉందని ఆయన పేర్కొన్నారు.
Next Story

