Tue Mar 24 2026 10:39:45 GMT+0530 (India Standard Time)
రాహుల్ సీట్లు... నాయుడు నోట్లు

సీట్ల కోసం చంద్రబాబు నాయుడు వద్ద చేతులు కట్టుకునే దద్దమలు తెలంగాణలో పాలన ఎలా చేస్తారంటూ టీ కాంగ్రెస్ నేతలపై ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. శనివారం మహబూబాబాద్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ మాట్లాడుతూ... సోనియా గాంధీని అవినీతి అనకొండ అన్న చంద్రబాబు మళ్లీ అదే కాంగ్రెస్ తో ఎలా కలిశారని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ సీట్లు ఇస్తే... చంద్రబాబు నాయుడు నోట్లు ఇస్తారని అని ఆరోపించారు. మహాకూటమి సీట్లు పంచుకునే లోపే తాము స్వీట్లు పంచుకుంటామని ఆయన ఎద్దేవా చేశారు.
Next Story

