Thu Mar 19 2026 05:28:25 GMT+0530 (India Standard Time)
మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ఇచ్చింది అమ్మ కాదు....బొమ్మ కాదు అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సోనియా గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసిన కృషి, వందలాది మంది బలిదానాలతోనే తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు. శుక్రవారం టీఆర్ఎస్ భవన్ లో ఆర్య వైశ్య సంఘం నాయకులు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని, ఆనాడు తెలంగాణకు ఆంధ్రాకు బలవంతపు పెళ్లి చేసిందని ఆరోపించారు. ఇంటింటికీ నీళ్లు ఇవ్వడం.. కాంగ్రెసోళ్ల కిందకు నీళ్లు తేవడం ఖాయమని పేర్కొన్నారు. ఇంకో 15 ఏళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Next Story

