Tue Mar 24 2026 02:12:02 GMT+0530 (India Standard Time)
రెండు గడ్డాలు వస్తున్నాయి.. జాగ్రత్త..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ లో జరిగిన ప్రచారం సభలో మాట్లాడుతూ... పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు 30 ఉత్తరాలు రాశారని గుర్తు చేశారు. పొత్తు పెట్టుకుని రెండు గడ్డాలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆ గట్టున కరెంటు అడిగితే కాల్చిన వారున్నారని... ఈ గట్టున 24 గంటల కరెంటు ఇచ్చిన వారు ఉన్నారని ఎవరు కావాలో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. మహాకూటమి గెలిస్తే నెలకు ఒకరు సీఎం కుర్చీలో ఉంటారని పేర్కొన్నారు.
Next Story

