Tue Mar 17 2026 18:19:36 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ కి కుప్పలుగా డబ్బు వస్తోంది

కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ, అమరావతి, కర్ణాటక నుంచి విచ్చలవిడిగా డబ్బుల మూటలు వస్తున్నాయని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆరోపించారు. ఖమ్మంలో జరిగిన రోడ్ షో ఆయన మాట్లాడుతూ... కుప్పలుగా వస్తున్న ఆ సొమ్ముతో కాంగ్రెస్ ప్రకటనలు ఇస్తోందని పేర్కొన్నారు. ఎన్ని కోట్లు పంచినా ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలని కోరారు. రాహుల్ గాంధీ సీట్లు ఇచ్చినా... చంద్రబాబు నోట్లు ఇచ్చినా.. ప్రజలు మాత్రం టీఆర్ఎస్ కే ఓటేయాలని పిలుపునిచ్చారు.
Next Story

