Fri Mar 20 2026 07:03:30 GMT+0530 (India Standard Time)
మరికొద్దిసేపట్లో కేబినెట్...కేటీఆర్...?

తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీ రామారావు, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డికి మంత్రి వర్గ సమావేశం నుంచి మినహాయింపు లభించింది. మరికాసేపట్లో తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ ఇద్దరికీ సమావేశం నుంచి కేసీఆర్ మినహాయింపు ఇచ్చారు.
ఏర్పాట్లు పర్యవేక్షించాలని.....
ఇప్పటికే కొంగర కలాన్ లో జరుగుతున్న ప్రగతి నివేదన సభకు లక్షల సంఖ్యలో జనం వస్తుండటం, వారికి భోజన, మంచినీటి సదుపాయాలు కల్పించడం వంటివి దగ్గరుండి చూసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఈ ఇద్దరు మంత్రులు కొంగర్ కలాన్ లోనే ఉండిపోయి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కళాకారులతో కలసి డ్యాన్స్ చేశారు.
- Tags
- cabinet meet
- chief minister
- k chandrasekhar rao
- k.t.ramarao
- kongara kalan
- mahender reddy
- pragathi nivedana sabha
- telangana
- telangana rashtra samithi
- ts politics
- కె. చంద్రశేఖర్ రావు
- కే.టి.రామారావు
- కొంగరకలాన్
- టీ.ఎస్. పాలిటిక్స్
- తెలంగాణ రాష్ట్ర సమితి
- ప్రగతి నివేదన సభ
- మంత్రివర్గ సమావేశం తెలంగాణ
- మహేందర్ రెడ్డి
- ముఖ్యమంత్రి
Next Story

