Thu Mar 19 2026 16:48:06 GMT+0530 (India Standard Time)
కృష్ణా నదిలో ఘోర ప్రమాదం

కృష్ణా నదిలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద నదిలో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరందరి వయస్సు కూడా 20 ఏళ్ల లోపే. వీరంతా కంచికచర్లలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. పట్టిసీమ నీరు వదలడంతో కృష్ణా నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. నలుగురు విద్యార్థుల్లో ఒకరు నదిలోకి దిగగా మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన ముగ్గురు విద్యార్థులు కూడా గల్లంతయ్యారు. విద్యార్థులు ప్రవీణ్, చైతన్య, శ్రీనాథ్, రాజ్ కుమార్ గా గుర్తించారు. వీరు కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టాయి. కాగా, గత సంవత్సరం ఇదే ప్రాంతంలో పడవ ప్రమాదం జరిగి 21 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
Next Story

