నేడు కీలక సమావేశం..తేలనున్న పంచాయతీ
నేడు కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్థం పెంచడంపై చర్చ జరగనుంది. నేడు రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీని బోర్డు [more]
నేడు కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్థం పెంచడంపై చర్చ జరగనుంది. నేడు రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీని బోర్డు [more]

నేడు కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్థం పెంచడంపై చర్చ జరగనుంది. నేడు రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీని బోర్డు తేల్చనుంది. తమకు న్యాయంగా రావాల్సిన నీటినే వాడుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. తమ వాటాకు మించి చుక్క నీరును కూడా వాడుకోమని జగన్ స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ మేరకు కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. వరద నీటిని మాత్రమే వాడుకునేందుకు ఈ జీవో తెచ్చామని ఏపీ ప్రభుత్వం వాదిస్తుంది. ఈరోజు కృష్ణా రివర్ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.