Sat Mar 21 2026 20:45:23 GMT+0530 (India Standard Time)
కొండా దంవతుల కీలక నిర్ణయం...?

కొండా మురళి, కొండా సురేఖలు ఈరోజు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. కొండా సురేఖకు వరంగల్ తూర్పు నియజకవర్గం టిక్కెట్ ఇవ్వకుండా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెండింగ్ లో పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి అలకబూనిన కొండా దంపతులు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. అయితే వినాయక చవితి నవరాత్రులు పూర్తయ్యాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అది వారికి సెంటిమెంట్. నవరాత్రులు పూర్తి కావడంతో నేడు తమ భవిష్యత్ కార్యాచరణను కొండా దంపతులు ప్రకటించనున్నారు. కొండా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేరుగా రాహుల్ సమక్షంలోనే వారు కాంగ్రెస్ లో చేరేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ వీడే సందర్భంగా టీఆర్ఎస్ పై మరోసారి బహిరంగ లేఖ ద్వారా వారు విమర్శలకు దిగనున్నట్లు సమాచారం.
- Tags
- chief minister
- indian national congress
- k chandrasekhar rao
- konda murali
- konda surekha
- rahul gandhi
- telangana
- telangana rashtra samithi
- ts politics
- warangal east constiuency
- కె. చంద్రశేఖర్ రావు
- కొండా మురళి
- కొండా సురేఖ
- టీ.ఎస్. పాలిటిక్స్
- తెలంగాణ
- తెలంగాణ రాష్ట్ర సమితి
- భారత జాతీయ కాంగ్రెస్
- ముఖ్యమంత్రి
- రాహుల్ గాంధీ
- వరంగల్ తూర్పు నియోజకవర్గం
Next Story

