Sat Mar 21 2026 22:10:02 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కాంగ్రెస్ గూటికి కొండా దంపతులు

టీఆర్ఎస్ ను వదిలి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన వరంగల్ జిల్లా ముఖ్యనేతలు కొండా సురేఖ, కొండా మురళి కాంగ్రెస్ గూటికి చేరారు. నిన్న ఢిల్లీ వెళ్లి కొండా దంపతులు ఇవాళ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కొండా సురేఖకు వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఒక స్థానాన్ని కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొండా దంపతుల చేరికతో వరంగల్ జిల్లాలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.
Next Story

