Fri Mar 27 2026 10:44:12 GMT+0530 (India Standard Time)
ముందే నిర్ణయించుకున్నా....!!

నల్లగొండ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని తాను అసెంబ్లీ ఎన్నికలకు ముందే నిర్ణయించుకున్నానని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాను పార్లమెంటుకు పోటీ చేసేందుకు రాహుల్ కూగా ఎప్పుడో అంగీకరించారని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన తెలిపారు.
Next Story

