Tue Mar 24 2026 01:38:12 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కోమటిరెడ్డి, సంపత్ కుమార్ లకు భారీ ఊరట

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లకు హైకోర్టులో ఊరట లభించింది. వారి శాసనసభ్యత్వాలు రద్దు చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. వారిద్దరిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని తీర్పు చెప్పింది. ఇటీవల జరిగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా మైకు విసిరిన ఘటనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారిరువురూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించినట్లయింది.
Next Story

