Thu Mar 19 2026 18:22:24 GMT+0530 (India Standard Time)
దానం రాజీనామా ఆశ్చర్యం కలిగించలేదు

దానం నాగేందర్ పార్టీ మార్పును లైట్ తీసుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రెండేళ్లుగా దానం నాగేందర్ టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారన్నారు. ఆయన పార్టీ మారడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నా అవన్నీ సర్దుకుంటాయని, కార్యకర్తలు అధైర్యపడొద్దని ఆయన సూచించారు. పార్టీ పరిస్థితిపై రాహుల్ గాంధీకి సీనియర్ నేతల అభిప్రాయాలు చెప్పారని, వాటిని ఆయన పరిగణలోకి తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. జులైలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Next Story

