Wed Mar 25 2026 00:16:38 GMT+0530 (India Standard Time)
కోమటిరెడ్డి బ్రదర్స్ తో ఒరిగేదేం లేదు

తన భార్యకు నకిరేకల్ టిక్కెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ పేర్కొన్నారు. శనివారం ఆయన కాంగ్రెస్ ఇంఛార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కోమటిరెడ్డి బ్రదర్స్ తో కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిని ఓడిస్తామని కోమటిరెడ్డి బ్రదర్స్ అనడం సమంజసం కాదన్నారు. నకిరేకల్ సీటు ఇచ్చేందుకు ఇబ్బంది ఉంటే మహబూబ్ నగర్ లేదా షాద్ నగర్ స్థానాన్ని కేటాయించాలని కాంగ్రెస్ నేతలను కోరినట్లు తెలిపారు.
Next Story

