Thu Mar 19 2026 13:52:13 GMT+0530 (India Standard Time)
ఈ సెంచరీ ఆమెకే అంకితం : విరాట్ కోహ్లీ

ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టు విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితమిచ్చింది టీమిండియా. అలాగే 97, 103 పరుగులతో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ రాణించి భారత్ కు విజయాన్ని చేరువ చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఇన్నింగ్స్ ను భార్య అనుష్క శర్మకు అంకితం ఇచ్చాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఆయన మాట్లాడుతూ... అనుష్క తనను ఎంతగానో ప్రోత్సహించిందని చెప్పాడు. సోమవారం కూడా కోహ్లీ 23వ సెంచరీ సాధించిన తర్వాత విరాట్, అనుష్క లు ఫ్లైయింగ్ కిస్ లు ఇచ్చుకున్న విషయ తెలిసిందే. మొత్తానికి విరాట్-అనుష్క జంట క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తోంది.
Next Story

