పండ్ల మార్కెట్ కుప్ప కూలింది
కోహెడ పండ్ల మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కోహెడ ఫ్రూట్ మార్కెట్ ఈదురు గాలులకు మొత్తం కుప్పకూలిపోయింది. ఫ్రూట్ మార్కెట్ షెడ్ మొత్తంగా [more]
కోహెడ పండ్ల మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కోహెడ ఫ్రూట్ మార్కెట్ ఈదురు గాలులకు మొత్తం కుప్పకూలిపోయింది. ఫ్రూట్ మార్కెట్ షెడ్ మొత్తంగా [more]

కోహెడ పండ్ల మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కోహెడ ఫ్రూట్ మార్కెట్ ఈదురు గాలులకు మొత్తం కుప్పకూలిపోయింది. ఫ్రూట్ మార్కెట్ షెడ్ మొత్తంగా కూలిపోవడంతో పలువురు హమాలీలు తో పాటుగా రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాదులోని కొత్తపేట సమీపంలో ఫ్రూట్ మార్కెట్ ఉండేది. అయితే ఇటీవల కాలంలో కరోనా నేపథ్యంలో ఫ్రూట్ మార్కెట్ ని కోహెడ ఫ్రూట్ మార్కెట్ కు తరలించారు. కోహెడ ప్రాంతంలో సరైన వసతులు లేక పోయినప్పటికీ తాత్కాలికంగా షెడ్లను నిర్మించారు. అయితే కొద్దిసేపటి క్రితం భారీ ఈదురు గాలులతో పాటు గా వర్షం రావడంతో కోహెడ ఫ్రూట్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి అధికారులు చేరుకున్నారు. అయితే అక్కడ సరైన అంబులెన్స్‌లో తో పాటుగా రహదారులు లేకపోవడం తోటి క్షత్రగాత్రులను ఆసుపత్రికి తరలించడానికి ఆలస్యం జరుగుతుంది. మార్కెట్లో సరైన వసతులు లేక పోయినప్పటికీ తరలించడం పట్ల రైతులతో పాటు హమాలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

