Fri Jan 30 2026 18:24:37 GMT+0000 (Coordinated Universal Time)
ఊపిరి పీల్చుకున్న కోడెల

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెలశివప్రసాదరావుకు ఊరట లభించింది. ఆయన కరీంనగర్ కోర్టుకు హాజరయ్యే అవసరం లేకుండా హైకోర్టు తీర్పునివ్వడంతో కోడెల ఊపిరిపీల్చుకున్నారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడంతో కోడెల కరీంనగర్ పర్యటన తప్పింది. విషయంలోకి వెళితే స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై కొందరు కరీంనగర్ కోర్టును ఆశ్రయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను పదకొండున్నర కోట్లు ఖర్చు చేశానని, డబ్బు లేకుంటే గెలవడం కష్టమన్న కోడెల వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కరీంనగర్ కోర్టులో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కరీంనగర్ కోర్టు కోడెలను విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే దీనిపై కోడెల హైకోర్టును ఆశ్రయించగా కరీంనగర్ కోర్టు ఉత్తర్వును హైకోర్టు రద్దు చేసింది
Next Story
