Wed Mar 18 2026 19:42:35 GMT+0530 (India Standard Time)
కాంగ్రెస్ వైఖరిపై కోదండరాం అసంతృప్తి

పొత్తు ధర్మం విస్మరిస్తూ టీజేఎస్ కి కేటాయించిన స్థానాలల్లో అభ్యర్థులను నిలబెట్టి కాంగ్రెస్ బీఫాంలు ఇవ్వడం పట్ల ప్రొ.కోదండరాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీజేఎస్ కి కేటాయించిన దుబ్బాక, అంబర్ పేట, వరంగల్ ఈస్ట్, స్టేషన్ ఘన్ పూర్, మెదక్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా చూడాలని కోదండరాం కాంగ్రెస్ నేతలను కోరారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ ముఖ్యనేత అహ్మద్ పటేల్ కి ఫోన్ చేసి తన అసంతృప్తిని తెలియజేశారు. అయితే, నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే చివరి రోజు కావడంతో ఈ స్థానాల్లో పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు నేతలకు అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది.
Next Story

