Wed Mar 25 2026 11:25:34 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీడీపీకి షాకిచ్చిన కోదండరామ్

ఏడు నియోజకవర్గాల్లో బిఫారాలను తెలంగాణ జనసమితి కోదండరామ్ అభ్యర్థులకు ఇవ్వడం చర్చనీయాంశమైంది. మహబూబ్ నగర్ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించారు. అయితే అక్కడ తమ అభ్యర్థిగా రాజేందర్ రెడ్డి బరిలో ఉంటారని కోదండరామ్ తెలిపారు. అలాగే మిర్యాలగూడ స్థానానికి కూడా అభ్యర్థి విద్యాధర్ గా ప్రకటించి ఆయనకు బీఫారం ఇచ్చారు. వీటితో పాటు మెదక్, దుబ్బాక, సిద్దిపేట, మల్కాజ్ గిరి స్థానాలకు చెందిన అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చారు. మొత్తం మీద మహబూబ్ నగర్, మిర్యాలగూడ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి వారికి బీఫారాలు ఇవ్వడంతో మిత్రపక్షాలకు కోదండరామ్ షాకిచ్చినట్లయింది. అయితే రేపు నామినేషన్లకు తుది గడువు కావడంతో ముందు నామినేషన్లు వేసి, ఆ తర్వాత చర్చించుకుని ఎవరో ఒకరు ఉపసంహరించుకుంటే సరిపోతుందని టీజేఎస్ వర్గాలు చెబుతున్నాయి.
Next Story

