Tue Mar 24 2026 19:41:48 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కోదండరామ్ కు మళ్లీ పిలుపు...!!

తెలంగాణ జనసమితి అగ్రనేత ప్రొఫెసర్ కోదండరామ్ ను మళ్లీ ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. ఏఐసీసీ వర్గాల నుంచి కోదండరామ్ కు ఢిల్లీకి రావాలని పిలవడంతో ఆయన బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కోదండరామ్ ఢిల్లీకి వెళ్లి రాహుల్ ను కలసి వచ్చని సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ జన సమితికి 8 సీట్లు ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్న విషయాన్ని కుంతియా తెలిపారు.
సీపీఐ అసంతృప్తి......
దీంతో మరోసారి కోదండరామ్ తో మాట్లాడాలని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సీపీఐ మాత్రం కొంత అసంతృప్తిగానే ఉంది. సీపీఐకి కేవలం మూడు స్థానాలను మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో సీపీఐ రేపు సమావేశమై పొత్తుల అంశంపై చర్చించనుంది. ఈ సమావేశంలోనే కీలక నిర్ణయం తీసుకోనుంది. సీపీఐకి వైరా, బెల్లంపల్లి, హుస్నాబాద్ సీట్లను ఖరారు చేసింది.
- Tags
- bharathiya janatha party
- chief minister
- indian national congress
- k chandrasekhar rao
- left parties
- nara chandrababu naidu
- telangana
- telangana jana samithi
- telangana rashtra samithi
- telugudesam party
- ts politics
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- టీ.ఎస్. పాలిటిక్స్
- తెలంగాణ
- తెలంగాణ జన సమతి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- ముఖ్యమంత్రి
- వామపక్ష పార్టీలు
Next Story

