Fri Mar 20 2026 02:54:36 GMT+0530 (India Standard Time)
హరికృష్ణ లానే వారిని కూడా...

దేశంలో సచివాలయానికి రాని నెంబర్ వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఇందుకు గానూ ఆయనను గిన్నీస్ రికార్డులకు ఎక్కించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కొదండరాం ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ... నటుడు నందమూరి హరికృష్ణను గౌరవించినట్లే తెలంగాణ అమరవీరులను కూడా ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు. అమరుల త్యాగాలకు గుర్తుగా సెప్టెంబర్ 12న దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. రాజకీయ అవసరాలను బేరీజు వేసుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతిలో నెంబర్ 2గా, రైతు ఆత్మహత్యల్లో నెంబర్ 3గా, రైతు అప్పుల్లో నెంబర్ 2 స్థానంలో ఉండటం దారుణమన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 23 వేలు మాత్రమే భర్తీ చేశారని పేర్కొన్నారు.
Next Story

