Thu Feb 13 2025 09:30:32 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుది దయ్యాల కొంప
చంద్రబాబు ఇల్లు దయ్యాల కొంప మాదిరిగా మారిందని మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంట్లో సాయంత్రం కాగానే లైట్లు ఆర్పేస్తున్నారన్నారు. చంద్రబాబు ఇల్లు [more]
చంద్రబాబు ఇల్లు దయ్యాల కొంప మాదిరిగా మారిందని మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంట్లో సాయంత్రం కాగానే లైట్లు ఆర్పేస్తున్నారన్నారు. చంద్రబాబు ఇల్లు [more]

చంద్రబాబు ఇల్లు దయ్యాల కొంప మాదిరిగా మారిందని మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంట్లో సాయంత్రం కాగానే లైట్లు ఆర్పేస్తున్నారన్నారు. చంద్రబాబు ఇల్లు ఉంటే మాకేం…పోతే మాకేం అని కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇల్లు నీట మునిగినా… గాల్లోకి ఎగిరినా తమకు అనవసరమని మంత్రి కొడాలి స్పష్టం చేశారు. వరద వస్తుందనే చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారన్నారు. లేకుంటే ప్రకాశం బ్యారేజీపై కుర్చే వేసుకుని కూర్చునేవారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. కరకట్టపై ఉన్న ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని కొడాలి నాని పేర్కొన్నారు.
Next Story