Fri Mar 20 2026 00:01:36 GMT+0530 (India Standard Time)
జగన్ చెబితేనే ఫైనల్
కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ భాగస్వామ్యం కాబోతుందంటూ వస్తున్న వార్తలను మంత్రి కొడాలి నాని ఖండించారు. ఆ విషయం జగన్ నోటి నుంచి వస్తేనే నిజమవుతుందన్నారు. జగన్ మినహా [more]
కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ భాగస్వామ్యం కాబోతుందంటూ వస్తున్న వార్తలను మంత్రి కొడాలి నాని ఖండించారు. ఆ విషయం జగన్ నోటి నుంచి వస్తేనే నిజమవుతుందన్నారు. జగన్ మినహా [more]

కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ భాగస్వామ్యం కాబోతుందంటూ వస్తున్న వార్తలను మంత్రి కొడాలి నాని ఖండించారు. ఆ విషయం జగన్ నోటి నుంచి వస్తేనే నిజమవుతుందన్నారు. జగన్ మినహా ఎవరు మాట్లాడినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమే అవుతుంది కాని, పార్టీ అభిప్రాయం కాదన్నారు. అయితే తమ ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుందన్నారు. వైసీపీకి రాజ్యసభ సభ్యుల సంఖ్య పెరుగుతుందని, ఇక్కడ తమ మద్దతు బీజేపీకి అవసరమవుతుందని కొడాలినాని చెప్పారు. అప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుబట్టే అవకాశముంటుందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామంటే కేంద్రానికి సహకరించడంలో తప్పు లేదన్నారు.
Next Story