Sun Mar 22 2026 11:03:43 GMT+0530 (India Standard Time)
అది సాధ్యం కాదని తేల్చి చెప్పిన కిషన్ రెడ్డి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పట్లో శాసనసభ స్థానాల సంఖ్య పెంచే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన [more]
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పట్లో శాసనసభ స్థానాల సంఖ్య పెంచే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన [more]

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పట్లో శాసనసభ స్థానాల సంఖ్య పెంచే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న లోపాల వల్లనే సీట్లు పెంపు సాధ్యం కాదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా సీట్ల పెంపు అంశాన్ని చేర్చిందన్నారు. దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పునరవ్వ్యస్థీకరణ జరిగినప్పుడే ఏపీ, తెలంగాణాల్లో సీట్ల పెంపు జరుగుతుందని, అప్పటి వరకూ ప్రత్యేకంగా ఈ రెండు రాష్ట్రాల్లో సీట్ల పెంపు సాధ్యం కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Next Story