Mon Mar 16 2026 06:27:45 GMT+0530 (India Standard Time)
కిషన్ రెడ్డికి ఛాన్స్….!!
ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రేపు రాత్రి ఏడు గంటలకు మంత్రివర్గ సభ్యులు కూడా రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఈసారి తెలంగాణ నుంచి [more]
ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రేపు రాత్రి ఏడు గంటలకు మంత్రివర్గ సభ్యులు కూడా రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఈసారి తెలంగాణ నుంచి [more]

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రేపు రాత్రి ఏడు గంటలకు మంత్రివర్గ సభ్యులు కూడా రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఈసారి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి అవకాశం ఉంటుందని హస్తిన వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కిషన్ రెడ్డి యువకుడు కావడం, తొలి నుంచి బీజేపీలోనే ఉండటం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేయడం వంటివి ఆయనకు కలసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. గతంలోనూ తెలంగాణ నుంచి ఒక్కరే గెలిచినా బండారు దత్తాత్రేయకు మంత్రి పదవి దక్కింది. ఈసారి నలుగురు తెలంగాణనుంచి గెలవడంతో వారిలో సీనియర్ అయిన కిషన్ రెడ్డి మోదీ క్యాబినెట్ లో ఉంటారని చెబుతున్నారు.
Next Story