Wed Dec 10 2025 18:27:17 GMT+0000 (Coordinated Universal Time)
అన్ని రాష్ట్రాలకూ సాయం అందిస్తూనే ఉన్నాం
తెలంగాణకు అవసరమైన సాయాన్ని అందిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా కట్టడికి అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. కరోనా [more]
తెలంగాణకు అవసరమైన సాయాన్ని అందిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా కట్టడికి అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. కరోనా [more]

తెలంగాణకు అవసరమైన సాయాన్ని అందిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా కట్టడికి అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. కరోనా విషయంలో ఏ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సాయాన్ని నిరాకరించలేదని కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధాని మోదీ ఎప్పటకప్పుడు సమీక్షలు చేస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత లేకుండా చూస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు.
Next Story