రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్..?
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను ముఖ్యమంత్రలు పరిష్కరించుకుంటే బాగుంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సత్సంబంధాలున్నాయన్నారు. గతంలో ఇద్దరూ అనేక [more]

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను ముఖ్యమంత్రలు పరిష్కరించుకుంటే బాగుంటుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సత్సంబంధాలున్నాయన్నారు. గతంలో ఇద్దరూ అనేక సార్లు కలసి నీటి లభ్యత పై చర్చించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ కృష్ణా జలాల వివాదాన్ని వాడుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ వైఫల్యాన్ని ఆంధ్రప్రజలపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆంధ్రప్రజలను రాక్షసులుగా మాట్లాడటం వెనక ఇద్దరి సీఎంల ఒప్పందం ఉందని అనిపిస్తుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర నీటి వివాదాల విషయంలో సహకరిస్తుందని, ఇద్దరూ కూర్చుని చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుంటే మంచిదని ఆయన సూచించారు.