ఏప్రిల్ 20 తర్వాత అక్కడ మినహాయింపులు
ఈ నెల 20వ తేదీ తర్వాత లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా కేసులు లేని జిల్లాలకు [more]
ఈ నెల 20వ తేదీ తర్వాత లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా కేసులు లేని జిల్లాలకు [more]

ఈ నెల 20వ తేదీ తర్వాత లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా కేసులు లేని జిల్లాలకు ముందుగా లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశముందన్నారు. కరోనా కేసులు లేని చోట మాత్రమే ఈ మినహాయింపు ఉంటుందన్నారు. ఐదు కేసులు తక్కవగా ఉన్న చోట మినహాయింపులుంటాయన్నారు. మే 3వ తేదీ వరకూ మాత్రం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉంటుందని చెప్పారు. అన్ని రాష్ట్రాలతో చర్చించిన తర్వాతనే లాక్ డౌన్ ను పొడిగించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో ఆహారధాన్యాలకు కొరత లేదని, సంవత్సరానికి సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. నిత్యావసర వస్తువల ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హాట్ స్పాట్ లు కాని ప్రాంతాల్లో దుకాణాలు ప్రారంభించి ప్రజలు సోషల్ డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రత్యేక ప్రణాళిక ఉందని, ఏప్రిల్ 20వ తేదీ తర్వాత దీనిపై క్లారిటీ వస్తుందన్నారు.

