Thu Mar 19 2026 12:05:16 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు నాయుడు తెలివైనవారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలివైన వారని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీతోనే విభజన హామీలు అమలు చేయడం సాధ్యమవుతుందన్నారు. నాలుగేళ్లుగా ఏపీకి కేంద్రం చేసింది శూన్యమన్నారు. చంద్రబాబు తెలివైన వారని, రాష్ట్రానికి మేలు జరుగుతుందనే కాంగ్రెస్ తో కలిశారని కితాబిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కల అని గుర్తు చేశారు. వైసీపీ, జనసేన ఏ జట్టులో ఉంటాయో తెల్చుకోవాలని సూచించారు.
Next Story

