Fri Mar 20 2026 19:57:14 GMT+0530 (India Standard Time)
కీలక భేటీ ప్రారంభం

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం సింగపూర్ లోని కేపెల్లా హోటల్ లో వీరి భేటీ ప్రారంభమయింది. ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వీరి సమావేశంలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇద్దరు దేశాధినేతల మధ్య చర్చలు సఫలీకృతమవ్వాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది. మరి ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాల కోసం ఆసక్తిగా చూస్తున్నారు.
Next Story

