Mon Mar 23 2026 04:52:27 GMT+0530 (India Standard Time)
పవన్ వ్యాఖ్యలకు నిరసనగా కిడారి భార్య దీక్ష

మావోయిస్టులకు అనుకూలంగా జనసేన పార్టీ అధినేత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు భార్య పరమేశ్వరి దీక్షకు దిగారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆమె కుమారులతో కలిసి దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మావోయిస్టులకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను పవన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిజాయితీ గల నేతలు చనిపోతే విమర్శలు చేయడం సరికాదన్నారు. మావోయిస్టు మీనాదే ప్రాణమా..? కిడారి, సోమలవి ప్రాణాలు కావా..? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా శవరాజకీయాలు మానుకోవాలని ఆమె పేర్కొన్నారు. పరమేశ్వరి దీక్షకు టీడీపీ నేతలు మద్దతు తెలిపారు.
Next Story

