Sat Mar 21 2026 20:46:06 GMT+0530 (India Standard Time)
కిడారిని హత్య చేసింది వీరే....!

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్ే శివేరి సోమను హత్య చేసిన మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యేను హత్య చేసిన ఘటనలో ముగ్గురు మావోయిస్టులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకరు జులుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్, అలియాస్ రైనో. ఇతను తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల పోలీస్ స్టేషన్ పరిధిలోని దబ్బపాలెంకు చెందిన వాసిగా గుర్తించారు. మరొకరు కామేశ్వరి. కామేశ్వరి అలియాస్ స్వరూప, అలియాస్ సింద్రి ది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మూడో వ్యక్తి వెంకట రవి అలియాస్ చైతన్య అలియాస్ అరుణ. ఈమె విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవాని పాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
Next Story

