Mon Mar 23 2026 21:48:07 GMT+0530 (India Standard Time)
కిడారిని ఎందుకు హత్య చేశామంటే...?

ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, జరుపుతున్న హింసాకాండకు వ్యతిరేకంగానే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, శివేరి సోమలను హత మార్చినట్లు మావోయిస్టులు తెలిపారు. హత్య జరిగిన చాలా రోజుల తర్వాత మావోయిస్టులు లేఖ విడుదల చేయడం గమనార్హం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దుష్పరిపాలన రోజురోజుకూ మితిమీరి పోతుందని, ఏజెన్సీలో విలువైన సహజ ఖనిజాలను ప్రభుత్వం దోచిపెడుతుందని మావోయిస్టు ఏవోబీ ప్రతినిధి జగబంధు పేర్కొన్నారు. ఆయన పేరిట ఈ లేఖ విడుదలయింది. ఎమ్మెల్యే కూడా అతి విలువైన గ్రానైట్, బాక్సైట్ తవ్వకాలను స్వయంగా నిర్వహించారాని మావోయిస్టులు ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రజల ఆందోళనలు కూడా కిడారి పట్టించుకోలేదన్నారు. అందుకే కిడారి, శివేరిలను చంపేశామని జగబంధు ఆ లేఖలో వివరించారు.
Next Story

