Sun Mar 22 2026 01:20:14 GMT+0530 (India Standard Time)
కిడారి కుమారులకు బాబు భరోసా

మావోయిస్టుల చేతలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు కుమారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కున చేర్చుకున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం పాడేరు చేరుకుని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కిడారి సర్వేశ్వరరావుకు నివాళులర్పించారు. కిడారి సర్వేశ్వరరావుకు ఇద్దరు కుమారులున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారిద్దరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వారిని ఓదార్చారు. వారి భవిష్యత్తును తాను చూసుకుంటానని చెప్పారు. సోమ కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు పరామర్శించనున్నారు.
Next Story

