Sat Mar 21 2026 12:26:25 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీపీసీసీలో రేవంత్ రెడ్డికి కీలక పదవి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్లుగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీలోనూ వర్కింగ్ ప్రసిడెంట్ గా పనిచేసిన రేవంత్ రెడ్డి గత సంవత్సరం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రానున్న ఎన్నికలు కీలకమైనందున ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక బీసీ వర్గానికి చెందిన యువనేతగా పొన్నం ప్రభాకర్ కి కూడా వర్కింగ్ ప్రసిడెంట్ గా అవకాశం లభించింది.
Next Story

