Sat Mar 21 2026 00:12:07 GMT+0530 (India Standard Time)
నాని సంచలన ట్వీట్
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోసారి సంచలన ట్వీట్ చేశారు. తాను దివంగత లోక్ సభ స్పీకర్ బాలయోగి ఆస్తులను కాజేసిన మాట వాస్తవమేనని ఆయన [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోసారి సంచలన ట్వీట్ చేశారు. తాను దివంగత లోక్ సభ స్పీకర్ బాలయోగి ఆస్తులను కాజేసిన మాట వాస్తవమేనని ఆయన [more]

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మరోసారి సంచలన ట్వీట్ చేశారు. తాను దివంగత లోక్ సభ స్పీకర్ బాలయోగి ఆస్తులను కాజేసిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. బాలయోగి నీతి, నిజాయితీలతో ఆస్తులు సంపాదించారని, వాటిని కాజేసినందుకు గర్వపడుతున్నానని కేశినేని నాని తెలిపారు. బాలయోగి ఆస్తులను కాజేశారని పరోక్షంగా కేశినేని నానిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో కేశినేని నాని ట్వీట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. బుద్దా వెంకన్న మాత్రం తాను ఇక ట్వీట్ చేయనని నిన్ననే ప్రకటించారు.
Next Story