భయం గుప్పిట్లో కెన్యా ...!

కెన్యా లో ప్రకృతి విలయానికి వందల సంఖ్యలో పౌరులు బలయ్యారు. నిన్న మొన్నటివరకు వర్షాలు లేక కరువుతో అల్లాడిన కెన్యా కు ఇప్పుడు భారీ వర్షాలు శాపంగా పరిణమించాయి. మారిన వాతావరణ పరిస్థితులతో ఈ వైపరీత్యం సంభవించింది. భారీ వర్షాల ప్రభావంతో నైరోబీలో డ్యామ్ కు గండిపడటంతో ఒక గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటివరకు 215 మంది అకాలవర్షాలు భారీ వరదలకారణంగా జలసమాధి అయిపోయారు.
మరింత ముప్పు పొంచే ఉందన్న నిపుణులు ...
మృతుల్లో అత్యధికులు చిన్నారులు, వృద్ధులే వున్నారు. సహాయ బృందాలు రంగంలోకి దిగి అనేకమందిని మృత్యు కోరలనుంచి రక్షించారు. ఇదిలా ఉండగా కెన్యా లో మరికొన్ని డ్యాములకు భారీ వరద ముప్పు పొంచి వుంది. నిపుణుల హెచ్చరికలతో కెన్యా అంతా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆకాల భారీ వర్షాలతో కెన్యా లో ఎక్కడ చూసిన పెద్ద సంఖ్యలో శవాలు కనిపిస్తున్నాయి. గల్లంతైన వారి కోసం తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం.
