Thu Mar 19 2026 16:57:29 GMT+0530 (India Standard Time)
కాళ్లు పట్టుకున్నా పొత్తు పెట్టుకోం

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో కలిసేది లేదని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు కాళ్లు పట్టుకున్నా తెలుగుదేశం పార్టీ వారితో పొత్తు పెట్టుకోదని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. నిన్న కూడా కేఈతో పాటు మరో మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా పొత్తు ఉండదని, పొత్తు పెట్టుకుంటే ప్రజలు గుడ్డలూడదీసి కొడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Next Story

