Sat Jan 31 2026 15:42:06 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడకు తెలంగాణ ముఖ్యమంత్రి

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం బెజవాడకు వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కనకదుర్గమ్మకు ముక్కుపుడక చేయిస్తాననే మొక్కును తీర్చుకునేందుకు ఆయన దుర్గమ్మ ఆలయానికి వెళ్లనున్నారు. కుటుంబసభ్యులతో కలిసి గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లనున్నారు. గతంలోనే ముఖ్యమంత్రి పర్యటన ఉంటుందనుకున్నా, బిజీ షెడ్యూల్ వల్ల వాయిదా పడింది. ప్రస్థుత పర్యటనపై ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున ఎవరైనా మంత్రి స్వాగతం చెప్పే అవకాశం ఉంది.
Next Story

