Thu Mar 19 2026 15:19:25 GMT+0530 (India Standard Time)
సవాల్ కు సై అన్న ఉత్తమ్

ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధమేనా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సవాల్ కి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సై అన్నారు. ముఖ్యమంత్రి సవాల్ ను స్వీకరిస్తున్నామని, ఎన్నికలు మేలో వచ్చినా, డిపెంబర్ లో వచ్చినా, ఇప్పుడే వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు. ముందస్తు ఎన్నికలు వస్తే కేసీఆర్ పాలన కొంత ముందే ముగుస్తుందని, ఇది తెలంగాణ ప్రజలకు శుభవార్త అని ఆయన పేర్కొన్నారు. అధికార, విపక్షాల సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమేననే ప్రచారం జోరందుకుంది. ఈ డిసెంబర్ లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి.
Next Story

